వైయస్‌ జగన్‌ పాదయాత్రలో 86 ఏళ్ల వృద్ధుడు

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నేను సైతం అంటూ 86 ఏళ్ల వృద్ధుడు కదం తొక్కుతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైయస్‌ జగన్‌ వెంటే పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్నారు.  రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ మంచి చేయగలడన్న నమ్మకంతో ఆయనతో కలిసి నడుస్తున్నానని ఆ వృద్ధుడు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిఎన్నో అభివృద్ధి పనులు చేశారని,  నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు మోసపోయార ని విమర్శించారు. ప్రాణం పోయిన పాదయాత్ర ఆపేది లేదని వృద్ధుడు పేర్కొన్నారు.

 
Back to Top