రాజన్న రాజ్యం తిరిగి తీసుకురండ‌న్నా..

తూర్పుగోదావరి : టీడీపీ పాలన పై అసంతృప్తిగా ఉన్నామని పెద్దాడకు చెందిన షిరిడీసాయి మహిళా సంఘం సభ్యురాలు మందాల వెంకటరత్నం వైయ‌స్ జగన్‌కు తెలిపింది. చంద్రబాబు హామీ మేరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ఆశించి భంగపడ్డామని తెలిపింది. ప్రస్తుతం రుణాలు పొందాలంటే పొదుపులో రూ.లక్ష వరకు ఉండాలని చెబుతున్నారని, వైయ‌స్‌ హయాంలో పొదుపులో రూ.పది వేలు ఉంటేనే రుణం మంజూరయ్యేదని తెలిపింది. రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని కోరింది.
Back to Top