కౌలురైతు కార్డు ఇవ్వమంటే.. రూ. 500 అడుగుతున్నారు

తూర్పుగోదావరి: చంద్రబాబు పాలనలో ఏ పనికావాలన్నా.. లంచం అడుగుతున్నారని, జన్మభూమి కమిటీల నుంచి ఎమ్మార్వో వరకు అంతా పేదవారిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. ఈ మేరకు టీడీపీ అవినీతిని జననేతకు వివరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కౌలురైతు కార్డు కావాలంటే రూ. 5 వందలు తీసుకుంటున్నారని, ఇళ్లు లేక అనేమంది ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ల మంజూరుకు పేర్లు రాయాలన్నా.. రూ. 5 వేల లంచం అడుగుతున్నారన్నారు. ఇల్లు, పెన్షన్, రేషన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి జీరాక్స్‌లు తీయడానికి విసిగిపోతున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌ రుణాలను కూడా టీడీపీ కార్యకర్తలకే ఇస్తున్నారన్నారు.  వైయస్‌ జగన్‌ వస్తేనే మా కష్టాలు తీరుతాయన్నారు. 
Back to Top