నెలకోసారి రక్తం ఎక్కించాలి..

 
 
తూర్పుగోదావరి :తన బిడ్డ ఆదర్శినికి నెలకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోందయ్యా అంటూ పాదయాత్రలో వైయ‌స్ జగన్‌కు తన చిన్నారి ఆరోగ్య సమస్యను చెప్పుకున్నారు పెద్దాపురం ఆర్‌బీ కొత్తూరుకు చెందిన దండుప్రోలు సత్యవేణి, మహేష్‌లు. పాదయాత్రలో  చిన్నారి ఆదర్శినిని వైయ‌స్ జగన్‌కు చూపించి తలసేమియా వ్యాధితో బాధపడుతోందయ్యా అంటూ చెప్పారు. తాము విరవ బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నామని, ఆర్థికంగానూ స్తోమతలేక సతమతమవుతున్నామంటూ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top