మీడియాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి


అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కార్పొరేషన్ల తరహాలో మీడియాకు కూడా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని జ‌ర్న‌లిస్టులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. చిన్మయనగర్‌ సమీపంలో  ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ను జర్నలిస్టులు ఆజాద్, బెంజ్‌మెన్, అనిల్‌ కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. జర్నలిస్టులు మరణిస్తే దహన సంస్కారాల కోసం ప్రభుత్వ ఉద్యోగి తరహాలో తక్షణమే రూ.5 వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించేలా చూడాలన్నారు. ఉత్తమ జర్నలిస్టుల జాబితాను నవ్యాంధ్రలో ప్రకటించినా నేటి వరకు వారిని సత్కరించలేదని విచారం వ్యక్తం చేశారు.
Back to Top