వైయ‌స్ఆర్‌ అభిమాని శ‌ప‌థం


క‌ర్నూలు:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమాని గ‌తంలో చేసిన శ‌ప‌థానికి ఇంకా క‌ట్టుబ‌డి ఉన్నాడు. ఈ అరుదైన సంఘట‌న క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో స‌జీవ సాక్షంగా ఉంది. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణానికి చెందిన బోయ వెంక‌టేశ్‌ 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రాణ స్వీకారం చేసే వ‌ర‌కూ చెప్పుల్లేక‌లుండా ఒట్టి కాళ్ల‌తోనే న‌డుస్తాన‌ని అప్ప‌ట్లో శ‌ప‌థం చేసి..ఇప్ప‌టికీ చెప్పులు లేకుండానే తిరుగుతున్నాడు. ఈయ‌న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొని శ‌నివారం జ‌న‌నేత‌ను క‌లిశాడు. ‘అన్నా.. మీరు సీఎం అయ్యే వరకూ చెప్పుల్లేకుండా నడుస్తానని శపథం చేశా.. నాలుగేళ్లకు పైగా చెప్పుల్లేకుండానే నడుస్తున్నా..’ అంటూ ఆయనతో చెప్పాడు. రోజూ తాపీ పనికి వెళ్లి వెంక‌టేశ్ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి అభిమానిని చూసిన అక్క‌డి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సారి వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని, నీ కోరిక నెర‌వేరుతుంద‌ని వెల్దుర్తి ప్ర‌జ‌లు వెంక‌టేశ్‌ను అభినందించారు.  

Back to Top