వైయస్‌ఆర్‌ వల్లే ప్రాణాలతో ఉన్నాను

పశ్చిమ గోదావరి: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వల్లే తన ప్రాణాలతో ఉన్నానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీ అన్నారు. నరసాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో లక్ష్మీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుంది. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే తన ప్రాణాలు నిలబడ్డాయన్నారు. ఆయన చేసిన మేలుమరిచిపోలేనని, వైయస్‌ కుటుంబానికి కృతజ్ఞురాలిగా ఉంటానన్నారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌కు వైయస్‌ఆర్‌ సంతకంతో కూడిన లేఖను ఫ్రేమ్‌ కట్టించి ఇచ్చారు. అనంతరం లక్ష్మీ మాట్లాడుతూ.. తన ఆరోగ్యం బాగులేదని తెలిసి వైద్యం చేయించుకోమని లేఖ పంపించిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎక్కడుందో తెలియదని, కనీసం అంబులెన్స్‌లు కూడా కనిపించడం లేదని లక్ష్మీ కోడలు శాంతి అన్నారు. వైయస్‌ఆర్‌ వల్లే తమ కుటుంబం సంతోషంగా ఉందన్నారు. 
Back to Top