చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది మేమే

 
అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది తామే అని అఖిలభారత గాండ్ల కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. సోమవారం గాండ్ల కులస్తులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో 3 శాతం జనాభా ఉన్న గాండ్ల కులస్తులను చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా గాండ్ల కులస్తులు ఉన్నారని, చంద్రబాబును నమ్మి ఓట్లు వేస్తే దగా చేశారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గాండ్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు మహానేత మరణించడంతో మాకు అన్యాయం జరిగిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. తామంతా వైయస్‌ జగన్‌కు అండగా ఉంటామని తెలిపారు.
 
Back to Top