మామిడి రైతుల్ని దోచేస్తున్నారు

చిత్తూరు: ‘సార్‌..! జిల్లాలో సహకార డెయిరీని ఎలాగైతే మూసేసి హెరిటేజ్‌ను డెవలప్‌ చేసుకున్నారో.. ఇప్పుడు మామిడి రైతుల్ని అలాగే దోచేస్తా ఉండారు. టీడీపీకి చెందిన గల్లా అరుణకుమారి, సత్యప్రభతో పాటు చంద్రబాబు కంపెనీలు రూ.కోట్లు గడిస్తా ఉండాయి. రైతుకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఈ దోపిడీని అరికట్టాలి..’ అంటూ తిరుపతికి చెందిన బుజ్జమ్మ బుధవారం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. పాదిరేడు వద్ద ప్రజా సంకల్పయాత్రలో ఆమె మాట్లాడుతూ మామిడి పంటను దోచుకుంటున్న ప్రైవేటు కంపెనీలకు ముకుతాడు వేయాలంటే రైతుల సహకార రంగం కిందికి మామిడి గుజ్జు పరిశ్రమను తీసుకురావాలని కోరారు.  
Back to Top