మ‌త్స్య‌కారులంతా వైయ‌స్ జ‌గ‌న్ వెంటే


తూర్పుగోదావరి : మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని, మేమంతా ఆయ‌న వెంటే ఉంటామ‌ని మ‌త్స్య‌కారులు ప్ర‌క‌టించారు. బుధ‌వారం వైయ‌స్‌ జగన్‌ను ద్రాక్షారామ వద్ద స్థానిక బెస్తవీధికి చెందిన మత్స్యకారులు చెరువు చేప, వలలను చూపించారు. వైయ‌స్ జగన్‌కు తమ వృత్తి విధానాన్ని వివరించామని, ఆయన ఎంతగానో ఆప్యాయంగా మాట్లాడారంటూ మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. బెస్తపేటకు చెందిన మత్స్యకార కుటుంబాల వారు ఇంటిల్లపాది వచ్చి వైయ‌స్ జగన్‌ను కలిశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.
Back to Top