వేరుశనగకు గిట్టుబాటు ధర లేదు

మదనపల్లె: వేరుశనగ పంట దిగుబడి మంచిగా వచ్చిందనుకుంటే గిట్టుబాటు ధర కల్పించడం లేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పంట ఖరీదు కట్టించారు. కానీ తెలుగుదేశం వచ్చినప్పుడు పంట నష్టం కట్టించడం లేదు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వేరుశనగ రూ. వెయ్యి కంటే ఎక్కువ అమ్ముడుపోవడం లేదు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మా గ్రామానికి వచ్చిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా సమస్యను చెప్పుకున్నాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని చెప్పారని వేరుశనగ రైతులు చెప్పారు. 
Back to Top