టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

 క‌ర్నూలు:  మా ప్రాంతంలో ట‌మాట జ్యూస్ ప్యాక్ట‌రీ ఏర్పాటు చేయాల‌ని స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. ప్రజాసంకల్ప యాత్రగా భాగంగా శ‌నివారం ప‌త్తికొండ రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. వ‌ల‌సల నివారణకు కొత్తపల్లి రిజర్వాయర్‌ నుంచి పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాలకు సాగునీరు అందించాలన్నారు. నియోజకవర్గంలో పత్తికొండతో పాటు అన్ని మండలాల్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. కొత్తపల్లి రిజర్వాయర్‌ వద్ద ఫిల్టర్‌ ట్యాంకు ఏర్పాటు చేసి పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాలతో పాటు ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, ఆస్పరి మండలాల్లో ఖరీఫ్‌లో అత్యధికంగా టమాట సాగు చేస్తారని, రైతుల కోసం టమాటజ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని జననేతను కోరారు. మన ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైయ‌స్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

Back to Top