బ్యాంకుల్లో అప్పులు మిగిలాయి

గుంటూరు:‘రుణమాఫీ కాలేదు.. వడ్డీలు చెల్లించలేక బ్యాంకుల్లో అప్పులు మిగిలాయి’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన ముతిన సత్యనారాయణ, నామా వెంకటేశ్వర్లు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు మండలంలోని ములుకుదురు గ్రామంలో వైయ‌స్ జగన్‌ని కలసి సమస్యలు విన్నవించారు. రుణమాఫీ చేస్తాం..అప్పులు చెల్లించొద్దని చెప్పిన చంద్రబాబునాయుడు మాట నమ్మి మోసపోయామని వాపోయారు. రైతులను అప్పుల బాధ నుంచి బయటపడేయాలని జననేతకు విజ్ఞప్తి చేశారు.
Back to Top