నష్టాలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు

గుంటూరు: తమలపాకు పంటకు కూడా ఇతర వాణిజ్య పంటల మాదిరిగానే బీమా సౌకర్యం కల్పించాలని మండల తమలపాకు రైతులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పొన్నూరు చేరుకున్న ప్రతిపక్ష నేత వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డిని కలసి సమస్యలు విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగువేల ఎకరాల్లో తమలపాకు సాగవుతోందన్నారు. ఎకరాకు రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుందని వివరించారు. నలభై ఏళ్ల నుంచి పంటకు తెగుళ్లు, వైరస్‌లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు. నష్టాలను ఎదుర్కోలేక  రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలపాకు పంటకు కూడా బీమా కల్పిస్తే రైతులకు మేలు చేకూరుతుందని వైయ‌స్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. సీహెచ్‌ సుధాకర్‌రెడ్డి, దుర్గారావు, బి.రంగబాబు, పి.రామచంద్రరావు, సీహెచ్‌ దుర్గయ్య తదితరులున్నారు.

Back to Top