ధాన్యానికి ధ‌ర లేదు

నెల్లూరు : ‘అన్నా.. మేము ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం.. పంట చేతికి అందే సమయంలో గిట్టుబాటు ధర రాక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం’ అంటూ అయ్యపురెడ్డిపాళెం వద్ద సోమవారం రాజమోహన్‌రెడ్డి అనే యువ రైతు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించాడు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం పుట్టి రూ.18 వేలు నుంచి రూ.19 వేలు వరకు ఉండేదని తెలిపాడు. మూడు నెలల క్రితం పుట్టి రూ.15 వేలు ఉండేదని, ప్రస్తుతం రూ.12 వేలు పలుకుతోందని వాపోయాడు. పెట్టిన పెట్టుబడితో పాటు పడిన కష్టానికి కూడా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులందరికీ న్యాయం చేస్తామని జననేత వైయ‌స్‌ జగన్‌ అతనికి ధైర్యం చెప్పారు.

Back to Top