పంటలు వేద్దామంటే నీరు లేదన్నా

నెల్లూరు : టీడీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నా’ అని  నెల్లూరు జిల్లాకు చెందిన రైతులు పెంచలరెడ్డి పార్థసారథిరెడ్డి, బుజ్జిరెడ్డి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ‘పంటలు వేద్దామంటే నీరు లేదన్నా, వేసిన పంటలు అమ్ముకుందామంటే మద్దతు ధర లేదు.పండిన  పంట‌లు అమ్ముకోవాలంటే కనీస ధర కూడా లేదన్నా’ అంటూ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని జననేత వైయ‌స్ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు.

Back to Top