అర్జీలు ఇచ్చినా లాభం లేదు

 
 
నెల్లూరు: ‘అయ్యా.. వరుణుడు ఏటికేడు ముఖం చాటేస్తూ రైతులను కరువు కోరల్లోకి నెడుతున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులను పక్కకు పెట్టి మేం ఉపాధి పనులకు వెళుతున్నాం. కష్టపడి పనిచేస్తున్నాం. అయితే, చేసిన పనులకు సక్రమంగా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు’ అంటూ వీరారెడ్డిపాళెంనకు చెందిన కోటారెడ్డి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయాడు. డబ్బులు అందక రోజురోజుకూ కుటుంబ జీవనం దుర్భరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కరించాలని అధికారులకు అర్జీలు ఇచ్చినా లాభం లేదని వాపోయాడు. 

Back to Top