సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

తూర్పుగోదావరి : సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు జి.మురళీకృష్ణ, భాస్కర్‌రెడ్డి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో  వారు జగన్‌ను కలుసుకుని ఈ మేరకు వినతి పత్రం అందించారు. సీపీఎస్‌ విధానంపై రెండున్నరేళ్లుగా పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందన్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, రాష్ట్ర పరిధిలో లేదని చెబుతోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని ప్రకటించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top