సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

పశ్చిమగోదావరి : సీపీఎస్‌(కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం)విధానం వల్ల పెన్షన్‌కు దూరమవుతున్నాం.. మా భవిష్యత్తుకు భరోసా కొరవడింది... అలాగే సర్వశిక్షాభియాన్‌లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నాం.. చాలీచాలని జీతాలతో అవస్థపడుతున్నాం.. ఇలా ఎందరో ఉద్యోగులు చంద్రబాబు పాలనలో అభద్రతో బతుకుతున్నార‌ని ఉద్యోగులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్యోగులు క‌లిశారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ ఏపీ సీపీఎస్‌ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.  
Back to Top