సీపీఎస్‌ విధానం రద్దుపై హర్షం

కర్నూలు: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఉద్యోగులు కలిసి మద్దతు తెలిపారు. 2004కు ముందు పెన్షన్‌ వచ్చేది. ఆ తరువాత నియమితులైన ఉద్యోగులకు పెన్షన్‌ తొలగించారు. పాదయాత్ర తొలి రోజే సీపీఎస్‌ విధానం రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో జననేత పాదయాత్రకు సంఘీభావం తెలిపినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. 

 
Back to Top