త‌మ‌ జీవితానికి భరోసా లేదు


తూర్పుగోదావరి : సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో పింఛను ఇచ్చేలా చూడాలని వైయ‌స్‌ జగన్‌ను వైద్య, ఆరోగ్య సిబ్బంది కోరారు. పాదయాత్రగా వెళ్తున్న వైయ‌స్ జగన్‌ను ఫస్ట్‌ ఏఎన్‌ఎం బి.మంగాయమ్మ, సెకండ్‌ ఏఎన్‌ఎం ఎం.అరుణ కలిసి సమస్యలను చెప్పుకున్నారు. చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా శాస్త్రీయ పద్ధతిలో ఇచ్చే పింఛను లేకపోవడంతో తమకు ఆందోళనగా ఉందన్నారు. రిటైర్‌ అయ్యిన తర్వాత తమ జీవితానికి భరోసా లేకపోతోందన్నారు. పాత పద్ధతిలో పింఛను ఇవ్వడం ద్వారా తమకు భద్రత ఉంటుందన్నారు. అనేక సార్లు సీపీఎస్‌ ఉద్యోగులంతా ఆందోళన చేసినా పట్టించుకున్నవారు లేరని, సీపీఎస్‌ను రద్దు చేసేలా చూడాలని వైయ‌స్ జగన్‌ను కోరామని సిబ్బంది చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top