కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

కోవెలకుంట్ల: ప్రజా సంకల్పయాత్ర పేరుతో క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ప‌లువురు క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి ఆ సంఘం నాయ‌కులు జ‌న‌నేత‌ను కోరారు. అలాగే  రాష్ట్ర ఉపాధ్యాయ జాతీయ పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఏపీటీఎఫ్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ ఖాజాహుసేన్, సీపీఎస్‌ సంఘం నాయకులు చిన్న షరీఫ్, సతీష్‌కుమార్, శ్రీనివాస్, సునీల్, మదన్, సురేష్, వేణుగోపాల్‌ తదితరులు వైఎస్‌ జగన్‌ను కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రూ.398 వేతనంతో పని చేసిన స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నూతన సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరారు.  
Back to Top