మా కుటుంబ సంతోషం వైయస్‌ఆర్‌ భిక్షే

అనంతపురం:

మహానుభావుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వల్లే సంతోషంగా ఉన్నామని ఓ నిరుపేద కుటుంబం ముందకు వచ్చింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ను వారు కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ కుటుంబం సంతోషంగా ఉండాలని జననేతను రైతు దంపతులు ఆశీర్వదించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. నా రెండో కొడుకుకు కంటి చూపులేదని, చికిత్స కోసం బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్‌ తిరిగినా ఫలితం లేదు. 2004లో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కదిరికి వచ్చారు. విషయం తెలుసుకొని వెళ్లి ఆయన్ను కలిశాం. నీ బిడ్డకు కంటి చూపు తెప్పించే బాధ్యత నాది. ఖర్చు ఎంతైనా నేనే భరిస్తానని చెప్పి చికిత్స చేయించారు. మూడు నెలల్లో నా కొడుకుకు కంటిచూపు వచ్చింది. అంతే కాకుండా నా కుటుంబం ఉండేందుకు సొంతిల్లు, రూ. 50 వేల ఆర్థిక సహాయం చేశారని ఆ రైతు చెప్పారు. వైయస్‌ఆర్‌ కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో సీఎం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. మా కుటుంబం ఇలా సంతోషంగా ఉందంటే అది వైయస్‌ఆర్‌ పెట్టిన భిక్షేనన్నారు.

Back to Top