మత స్వేచ్ఛ లేదు


విశాఖ: రాష్ట్రంలో మత స్వేచ్ఛ లేదని, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని చర్చీ ఫాదర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో తమ సమస్యలు పరిష్కరించాలని చర్చి ఫాదర్లు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవులు ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశమంటూ నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా న్యాయం జరగడం లేదన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో క్రైస్తవులకు ధైర్యం ఉండేదన్నారు. మహానేత మరణాంతరం మా గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. వైయస్‌ జగన్‌ కోసం మేం ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. 
 
Back to Top