జ‌గ‌న‌న్న‌ను చూడాల‌ని..అనంత‌పురం:  అతని పేరు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్‌. వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం అధికార రాష్ట్ర ప్రతినిధి. నెల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను ఎడమకాలు విరిగిపోయింది. వెంటనే ఆపరేషన్‌ కూడా చేయించుకున్నాడు. వైద్యులు కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా తన రియల్‌ హీరో వైయ‌స్‌ జగన్‌ను చూడాలన్న కోరిక అతన్ని నిలవనీయలేదు. కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడే వద్దంటూ వారిస్తున్నా. వందల కిలోమీటర్లు దాటుకొని అనంతపురం జిల్లా రాప్తాడు చేరుకున్నాడు. ప్రజా సంకల్ప యాత్రలో వైయ‌స్‌ జగన్‌ను కలుసుకుని, ఆయనతో పాటే కాసేపు నడిచారు. గతంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నానని, షర్మిలా చేపట్టిన పాదయాత్రలోనూ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడచినట్లు తెలిపారు. వైయ‌స్ జగన్‌తో కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని చంద్ర‌శేఖ‌ర్ పేర్కొంటున్నారు.

Back to Top