పెరిక కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

తూర్పుగోదావరి : అంబాజీపేట: తెలుగు రాష్ట్రాలలో తమ పెరిక కులస్తులకు సరైన గుర్తింపు లేదని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద  పెరిక కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రంలో భాగంగా విర‌వ గ్రామంలో జననేతను కలిసి , ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘ నాయకుడు పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ పెరిక కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. బొర్రంపాలెంలో 60 శాతం ఉన్న పెరిక కులస్తులకు కమ్యూనిటీ భవనం నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను ఆదుకోవాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top