హోదా వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

గుంటూరు: వైయస్‌ జగన్‌ ఒక్కరే ప్రత్యేక హోదాను సాధించగలరని తాడికొండ నియోజకవర్గం బట్టిపోలు డిగ్రీ కళాశాల విద్యార్థినులు అన్నారు. హోదా కోసం వైయస్‌ జగన్‌ నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉద్యమాన్ని కీలక దశకు తీసుకొచ్చారన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో విద్యార్థినులు వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, ఉద్యోగాలు వస్తాయని ఫ్లకార్డులు ప‌ట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జననేతతో సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమం ఆపవద్దని, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాల కోస‌మే పాలన చేస్తున్నారని వైయస్‌ జగన్‌కు వివరించారు. మాకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా సాధించాలని కోరారు. హోదా వస్తేనే మా జీవితాలు బాగుపడతాయన్నారు. ప్రత్యేక  హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, హోదా సాధించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, హోదా సాధించి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

Back to Top