నిన్ను చూసి బాబు న‌వ్వుతున్నాడు జ‌గ‌న్‌

జ‌గ‌న్ ఏమైనా ముఖ్య‌మంత్రా?  కేంద్ర మంత్రా? క‌నీసం మంత్రి కూడా క‌దా.. మ‌రి ఎందుకు అంతమంది జ‌గ‌న్ వెన‌కాల ప‌డుతున్నారు.. ట్రాఫిక్ జామ్ అయింద‌ని జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డానికి ఒక సీనియ‌ర్ ఎంపీ ప‌త్రికా వాహ‌నంలో  ఎందుకు వెళ్లాడు?  ఒక మాజీ మంత్రి జ‌గ‌న్‌కు స్వీట్ తినిపించి సామాన్య కార్య‌క‌ర్త‌లాగా ఎందుకు జోహార్లు కొడుతున్నాడు?  సీనియ‌ర్ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయ‌కులు సైతం జ‌గ‌న్‌తో ఫోటో తీయించుకునేందుకు ఎందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు.? జ‌గ‌న్‌ వ‌స్తున్నాడంటే ప్ర‌జ‌లు ఎందుకు ప‌డిగాపులు కాస్తున్నారు? జ‌గ‌న్‌లో ఉండేది ఏంటి?  నాలో లేనిది ఏంటి?  అంటూ చంద్ర‌బాబు త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర బాధ‌ను వెల్ల‌గ‌క్కుతున్నాడ‌ట‌. 

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి చంద్ర‌బాబు త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ని ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉన్న  క‌ర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ మంత్రి  మీడియా మిత్రుల ద‌గ్గ‌ర చెప్పిన విష‌యం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.  జ‌గ‌న్‌కు వ‌స్తున్న ఆ ప్ర‌జాధార‌ణ చూసి చంద్ర‌బాబు ఏడ‌వ‌లేక  పైకి న‌వ్వుతున్నాడ‌ని ఆ మంత్రి చెప్ప‌డంతో మీడియా మిత్రులు నిజామా స‌ర్ అని అడిగేశారు. దీంతో వీళ్లు ఎక్క‌డ  పేప‌ర్లో రాస్తారోన‌ని ఆ మంత్రి  ఈ విష‌యం ఎక్క‌డా చెప్ప‌వ‌ద్ద‌ని, చెబితే నాకూ ఇబ్బందులు ఉంటాయ‌ని మీడియా మిత్రుల ద‌గ్గ‌ర హామీ తీసుకున్నార‌ట‌. ఫైన‌ల్‌గా నాయ‌కుడు అంటే నాడు వైయ‌స్ఆర్‌.. నేడు జ‌గ‌న్ అన్న‌ది అక్ష‌ర స‌త్యం అని న‌వ్వేసి వెళ్లిపోయార‌ట‌. 
Back to Top