పెద్ద మాదిగనవుతానన్న చంద్రబాబు మాదిగల ద్రోహిగా మారాడు

ప్రకాశం:

ఎన్నికల సమయంలో పెద్ద మాదిగను అవుతానని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ప్రస్తుతం మాదిగల ద్రోహిగా మారాడని ఎస్సీ నేతలు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ను కలుసుకున్న మాదిగ నేతలు వారి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూటికి 80 శాతం మంది మాదిగలు కూలీలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికిపైగా ఉన్న మాదిగలు  నిరంతర శ్రామికులుగా ఉంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో మా చెప్పులు కుట్టి, మా డప్పు కొట్టిన చంద్రబాబు ఓట్లు దండుకున్న తరువాత మోసం చేశాడు. మా సమస్యలను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నాం.. అధికారంలోకి వచ్చిన తరువాత మాల, మాదిగలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. 

Back to Top