ఉద్యోగ భ‌ద్ర‌త క‌రువు

- వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ ఎఎన్‌ఎంలు
విశాఖ‌: ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కాంట్రాక్ట్‌ ఎఎన్‌ఎంలు  వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన టీడీపీ ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని జగన్‌ హమీ ఇచ్చారని ఎన్‌ఎంలు తెలిపారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్‌ ఎఎన్‌ఎం ఉద్యోగులు ఉన్నామని, మేమంతా జగనన్నకు ఓటువేసి గెలుపించుకుంటామన్నారు. అన్న వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామని తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top