వైయస్‌ఆర్‌ మరణించడం మా దురదృష్టం

వైయస్‌ జగన్‌ను కలిసిన ఏఎన్‌ఎంలు
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆవేదన
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఎన్‌ఎంలు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురంలో పాదయాత్ర చేస్తున్న జననేతను ఏఎన్‌ఎంలు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో 2008లో ఏఎన్‌ఎంలుగా విధుల్లో చేరామన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించారని, మహానేత బతికి ఉంటే తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ ఫస్ట్‌ ఏఎన్‌ఎంలతో సమానంగా గుర్తించడేవారమన్నారు. దేవుడికి తమపై దయ లేదని, అందుకే వైయస్‌ఆర్‌ను తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నీ విన్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. 
Back to Top