యానిమేట‌ర్‌గా తొల‌గించారు


 
తూర్పు గోదావ‌రి: గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పనిచేశాననే వంకతో టీడీపీ నాయకులు తనను యానిమేటర్‌గా తొలగించారని మానేపల్లికి చెందిన మద్దుల వరలక్ష్మి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయింది. 1999 నుంచి గ్రామంలో యానిమేటర్‌గా పని చేస్తూ 15 గ్రూపులు ఉన్న సంఘాన్ని 105 గ్రూపులుగా చేశానని, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీకి పనిచేశావంటూ టీడీపీ నాయకులు విధుల నుంచి తొలగించారని తెలిపింది.  
Back to Top