వైయస్‌ఆర్‌ హయాంలో అభివృద్ధి పరుగులెత్తింది

వేంపల్లి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులెత్తింది. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఇళ్లు లేని వారికి ఉచితంగా ఇళ్లు కట్టించారు. ఆయన ఉన్నప్పుడు ఏలోటు లేకుండా చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు పెద్దాయన దూరమయ్యాడు. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు. ఏ మేలు జరగలేదు. అంతా అన్యాయం. చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చుకోకుండా ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రభుత్వంగా చంద్రబాబు మారుతున్నాడు. చంద్రబాబు ఉంటే మాకు ఇంకా ఇబ్బందులే. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు అని వెలుగులోకి వస్తాయి. 

Back to Top