ఈ ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు లేవు


తూర్పు గోదావ‌రి:  అన్నా..పేరుకే మేము ఆశ కార్యకర్తలం. మాకు ఈ ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు లేవు. ప్రభుత్వం మాతో గొడ్డు చాకిరీ చేయించుకుంటోంది. ప్రస్తుత ప్రభుత్వం మా బతుకులు మారేందుకు ఎలాంటి ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవడంలేదు. నిర్ధిççష్టమైన వేతనం, పనివేళలు లేవు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుంచుతున్నారు. జీతాలు నిర్ధారించమంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అనేకసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని  ప్రజాసంకల్ప పాదయాత్రలో వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆశ వ‌ర్క‌ర్లు వినతిపత్రాన్ని అందజేశారు. 
Back to Top