స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాలి

తూర్పు గోదావ‌రి: 14 ఏళ్ల నుంచి చాలీచాలని జీతంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని ఆదుకో అన్నా అని ఆశ కార్యకర్తలు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో వైయ‌స్ జగన్‌ను వారు కలుసుకుని ప్రభుత్వం తమకు పనికి తగ్గ వేతనం అంటూ నెలకు రూ.వెయ్యి జీతం ఇస్తుందని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీతాలు చెల్లించాలని ఆశ కార్యకర్తలు భగవతి, మురీ కుమారి, దుర్గాలక్ష్మి, తిరుమలేశ్వరి, గంగా భవాని తదితరులు విజ్ఞప్తి చేశారు.
Back to Top