ఒంగోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిధి కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరుకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం.. కొద్దిసేపటి క్రితమే టంగుటూరుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సీఎం రాక సందర్భంగా టంగుటూరు బొమ్మల సెంటర్ జనసంద్రంలా మారింది. మరికాసేపట్లో కొండెపి నియోజకవర్గం టంగుటూరులో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. టంగుటూరు సభ అనంతరం కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.