వైఎస్‌కి బాబుకి మ‌ధ్యం 10 తేడాలు

చంద్ర‌బాబు హుషారుగా వుండ‌డం చూసి `` ఏంటి సార్‌, ఎవ‌రికైనా వెన్నుపోటు పొడిచారా?  చాలా సంతోషంగా వున్నారు`` అని పిఏ అడిగాడు.
 `` ఎందుక‌లా అడిగావు?`` అన్నాడు బాబు.
 `` ఎవ‌రికైనాచెడ్డ చేస్తేనే క‌దా, మీలో సంతోషం ఉప్పొంగేది``
  `` వైఎస్ చిత్ర‌ప‌టాన్ని తీయించేసాను. అందుకే సంతోషం లేక‌పోతే వైఎస్‌కి నాకూ పోలిక‌?``
  `` నిజ‌మే ఆయ‌న జ‌నం మ‌నిషి ఆయ‌న‌కీ మీకూ పోలికా.....``
  ``నువ్వు పొగుడుతున్నావా, తిడుతున్నావా?`` అనుమానంగా అడిగాడు బాబు.

  వాస్త‌వాలు చెబుతా వినండి మీకూ ఆయ‌న‌కి 10 తేడాలు చెబుతా..అంటూ పీఏ ఇలా చెప్పుకొంటూ వచ్చాడు.

    (1) ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి, మీకు ప్ర‌జ‌లుంటే గిట్ట‌దు
    (2) 1983 నుంచి 2004 వ‌ర‌కూ ఆయ‌న రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ మంత్రి కాదు, అయినా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్య‌మంత్రికి వున్నంత ఫాలోయింగ్ ఆయ‌న‌కుండేది, అధికారంలో లేని ప‌దేళ్ళు ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా కూడా జ‌నం మిమ్మ‌ల్ని గౌర‌వించ‌లేదు.
    (3) అధికారం కోసం అర్రులు చాచ‌డం, కుట్ర‌లు చేయ‌డం ఆయ‌న‌కి తెలియ‌దు. సొంత మామ‌నే వెన్నుపోటు పొడిచిన చ‌రిత్ర త‌మ‌రిది.
    (4) ప్ర‌జ‌లే ఆయ‌న భూమిక అందుకే మండుటెండ‌ల్లో వేల‌కిలోమీట‌ర్లు న‌డిచారు. అధికార‌మే ఆయ‌న ద‌గ్గ‌రికి న‌డుచుకుంటూ వ‌చ్చింది. జ‌నంలో వుండి పోరాటం చేయ‌డ‌మే త‌ప్ప మీలా లాబీయింగ్ రాజ‌కీయాలు ఆయ‌న‌కి తెలియ‌వు
    (5) ఆయ‌న్ని న‌మ్మి క‌ష్టాలు చెప్పుకోవ‌డానికి ఎంద‌రో సామాన్య జ‌నం ఆయ‌న ఇంటికి వ‌చ్చేవాళ్ళు.. మీ ఇంటి ముందు సామాన్యుల‌కి ప్ర‌వేశం వుందా?   రానిస్తారా? ఎప్పుడైనా వ‌చ్చారా
    (6) ఆయ‌న పాల‌న‌లో దేవుడు కూడా చ‌ల్ల‌గా చూశాడు క‌రువేలేదు. మీరు అడుగు పెట్టారో లేదో ఎక్క‌డ చూసినా క‌రువే.
    (7) ఆయ‌న ముఖాముఖి పోరాడుతారే త‌ప్ప‌, దొంగ‌దెబ్బ‌తీయ‌రు. రాజీప‌డ‌డం తెలియ‌దు. మీరు 1983లో సొంత‌మామ‌పై పోటీ చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి, నెల‌రోజుల‌కే మామ వంచ‌న చేరి పార్టీలో కుంప‌టి పెట్టారు. మాట మీద నిల‌బ‌డ‌డం ఆయ‌న హిస్ట‌రీ. అది మీ డిక్ష‌న‌రీలోనే లేదు
    (8) సంక్షేమం కోసం ఆయ‌న త‌పించారు. మీ హ‌యాంలో కించిత్తుమేలు ఎవ‌రికైనా జ‌రిగిందా?
    (9) పెద‌వుల‌పై చిరున‌వ్వు ఆయ‌న‌కి ఆభ‌ర‌ణం మీరు మ‌నస్ఫూర్తిగా న‌వ్వ‌డం ఎవ‌రైనా చూసారా?
    (10) ఆయ‌న చిత్ర‌ప‌టాన్ని తొల‌గించ‌గ‌ల‌రుగానీ, ప్ర‌జ‌ల గుండెల్లో గూడు క‌ట్టుకుని వున్న ఆయ‌న బొమ్మ‌ని తొల‌గించ‌గ‌ల‌రా?   సూర్యుడిని చూసిన‌వ్వాల‌ను కునేవాడు మాడిపోలేదు

ఆ దెబ్బ‌తో చంద్ర‌బాబు లేచి త‌న ఫోటోకు తానే ముసుగువేశాడు.
-రాహుల్‌
Back to Top