ఏది నాట‌కం... ఎవ‌రిది నాట‌కం మంత్రి బాబులు...!

ఏది నాట‌కం... ఎవ‌రిది నాట‌కం మంత్రి బాబులు...! 
         *******
ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ రాకుంటే ఏప్రిల్ 6వ తేదీన వైఎస్ఆర్సీపి ఎంపీల‌తో రాజీనామా చేయిస్తా అని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం టిడిపి ఉలిక్కిప‌డేలా చేసింద‌ని ఆ పార్టీ మంత్రుల వ్యాఖ్య‌లు చూస్తే అర్ధ‌మ‌వుతోంది. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాజీనామాల పేరుతో నాట‌కాలాడుతున్నార‌ని వ‌రుసుగా ప‌లు ప‌ర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసి ఘోర ఓట‌మి చ‌విచూసి ఇప్పుడు దొడ్డిదారిన చ‌ట్ట‌స‌భ‌ల్లోకొచ్చి మంత్రైపోయిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, నోరూ, వాయి తేడా తెలియ‌కుండా ఏదిప‌డితే అది మాట్లాడే మ‌రో మంత్రి అచ్చెంనాయుడు, గుంటూరు జిల్లా మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు, ఏ త‌డ‌వ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో బ్ర‌హ్మ‌దేవుడు కూడా క‌నిపెట్ట‌లేని గంటా శ్రీనివాస‌రావులు మీడియా ముందుకొచ్చి జ‌గ‌న్ నాట‌కాలాడుతున్నాడ‌ని వాక్రుచ్ఛారు... ఓకే మీ దృష్టిలో జ‌గ‌న్ నాట‌కాలాడుతున్నాడనే కాసేపు అనుకుందాం... కానీ ప్ర‌జ‌ల దృష్టిలో నాట‌కాలు ఎవ‌రాడుతున్నారని భావిస్తున్నారో తెలుసా... అస‌లు నాట‌కాలు ఆడ‌ట‌మంటే ఏమిటో తెలుసా... ఎపిలో స‌మైఖ్యాంధ్ర అంటూ తెలంగాణ‌లో నా వ‌ల్లే రాష్ట్రం వ‌చ్చింద‌ని చెప్పుకు తిర‌గ‌డం అంటే నాట‌క‌మాడ‌టం, వంచ‌న చేయ‌డం, చీక‌ట్లో చిదంబ‌రాన్ని క‌లిసి కాళ్లు ప‌ట్టుకుని భ‌వ‌తీ స్టే మ్ దేహీ అన‌డం నాట‌కం కింద‌కు రాదా, రాష్ట్ర విభ‌జ‌న చెయ్య‌మ‌ని ప్ర‌ణ‌బ్ క‌మిటీకి లేఖ ఇచ్చి... తీరా ఎక్రాస్ ది టేబుల్ అభిప్రాయాలు చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు తెలంగాణ నుంచి క‌డియం శ్రీహ‌రిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడ్ని పిలిచి ఒకే పార్టీ త‌ర‌పున రెండు అభిప్రాయాలు చెప్పించ‌డాన్ని ఏమంటారు. అవి నాట‌కాలు కావా...?  చివ‌రికి విభ‌జ‌న నిర్ణ‌యం జ‌రిగిపోయాక కూడా పెద్ద స‌మ‌ర‌యోధుడిలా ఎపి అంతా తిరిగి, ఢిల్లీలో నిరాహార‌దీక్ష‌లు చేసి మీ నాయ‌కులు వినిపించిన రెండు క‌ళ్ల సిద్దాంతం, కొబ్బ‌రి చిప్ప‌ల ఫార్ములాల‌న్నీ నాట‌కాల‌కింద‌కి రావా. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికి... అస‌లు మీరెందుకు రికార్డ్ చేశార‌ని ఆర్త‌నాదాలు పెట్టి... గంద‌ర‌గోళం సృష్టించి విజ‌య‌వాడ క‌ర‌క‌ట్ట‌కు పారిపోయి రావ‌డం పెద్ద‌నాట‌కం, ఏపికి చేసిన తీర‌ని ద్రోహం కాదా. ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని అన్న నోటితో నే హోదాతో ఏమొస్తుంది... కోడ‌లు మ‌గ‌పిల్లాడ్ని కంటానంటే అత్త‌వ‌ద్ద‌టుందా అని ప్యాకేజిపై ముద్దు ముద్దు మాట‌లు వ‌ల్లెవేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌ని చూడ‌టం నాట‌కం అవునో కాదో ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారు. కాబ‌ట్టి నాట‌కాలు వేయ‌డంలో మిమ్మ‌ల్ని అదే మీ చంద్ర‌బాబుని మించిన దిట్ట‌లు ఎవ‌రున్నారు మ‌ర మంత్రులూ!
Back to Top