మించిపోయామ్బాబుగారు చెబుతున్నట్టు దేశ వృద్ధి రేటు కంటే రాష్ట్ర వృద్ధి రేటులో మించిపోయాం..
కానీ తలసరి ఆదాయంలో మాత్రం అన్యాయంగా వెనుకబడిపోయాం..
రోజుకో ఫెస్టివల్ చేయడంలో రాష్ట్రాలన్నిటినీ మించిపోయాం..
కానీ ప్రజల అవసరాలు తీర్చడంలో చతికిలబడిపోయాం.
ఉద్యమాలను ఉక్కు పాదంతో అణచడంలో మిలటరీ పాలనను మించిపోయాం...
కానీ రాష్ట్ర హక్కులు సాధించడంలో చేతగాక చేతులెత్తేశాం. 
సీనియారిటీని చెప్పుకోడంలో దేశంలో నెంబర్ వన్ అయిపోయాం
 కేసుల నుంచి తప్పించుకోడానికి  కేంద్రం కాళ్లమీద అడ్డంగా పడిపోయాం. 
నీతి నిప్పు అని ఉడకని పప్పుల్తో సొంత డప్పాలు కొట్టడంలో నేషనల్ రికార్డు సాధించాం.
అవినీతి పెంచి పోషించడంలో ప్రపంచానికే బ్రాండ్ అబాసిడర్ అయిపోయాం
ఆర్థిక నేరగాళ్లను పోషించడానికి అధికార సత్రాన్ని తెరిచాం
కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టులు అప్పనంగా కట్టబెడుతున్నాం. 
దుబారా ఖర్చుల్లో దుబాయ్ రాజు ను మించిపోయాం.
గొప్పలు చెప్పుకోవడంలో పిట్టల దొరను తలదన్నాం. 
అమరావతి గ్రాఫిక్స్ లలో రాజమౌళిని మించిపోయాం
రాజధాని పేరు చెప్పి రైతుల నోట్లో మట్టికొట్టాం
అవును బాబుగారి పాలనలో అన్నిట్లో మించిపోయాం...
అడ్డంగా మునిగిపోయాం.  
Back to Top