పవన్ బాబు కోసం ఎదురు చూపులు

పవన్ కల్యాన్ బాబూ యాడికి పోనారండీ బాబూ.

ఆమజ్జెనఎప్పుడో ఓపాలి అగుపించారు. మల్లా ఇటువైపే చూడ్డంలేదు తవరు.

అది సరేగానీ బాబూ.. ఏటండీ ఇసేసాలు.? మీ  పెద్దన్నగోరూ...చిన్నన్నగోరూ  కులాసేనాండీ.

ఔనండీ బాబూ తవరు  జనసేన పార్టీ పెట్టినపుడు  ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు కదండీ. మరి ఒక్కపాలి కూడా  ప్రశ్నించరేటండీ బాబూ.

మీరేమో ప్రశ్నిస్తారని.. చంద్రబాబు తప్పుల్ని కడిగిపారేత్తారని నేనేమో మా స్నేహితుల దగ్గర తెగచెప్పీసీనండీ బాబూ. మీరు చూస్తే    అసలు బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడనేమాట్లాడరు.

అమరావతి చూత్తున్నారాండీ? రాజధానిలో బూవులన్నీ కూడా ముఖ్యమంత్రిగోరు.. ఆయనగారి అబ్బాయి లోకేష్ బాబు.. మంత్రులు..అంతా కలిసి బినామీ పేర్ల మీద  కొనిపారేశారండీ బాబూ. ఆళ్లంతా బూవులు కొన్నాక అప్పుడు అక్కడే రాజధాని కడతామన్నారు. దాంతో వాటిరేట్లు తెగపెరిగిపోనాయండి. రైతులేమో నెత్తిన చెంగేసుకున్నారు. మంత్రులు..టిడిపి నేతలూ బాగుపడ్డారు. మరి ఈ ఇసయం మీద మీరు ప్రశ్నించాలి కదండీ?  ప్రశ్నించరా?

రాజధాని కోసం పాపం అమాయక రైతుల నుండి బూవులు లాక్కుంటే తాట ఒలిచేస్తానన్నారు కదా మీరు. మరి ఇపుడేం చేత్తన్నారండీ.? ఎవరి తాట ఒలిచీరు? అసలు  ఎవరినన్నాకోపడ్డమన్నా చేయండి. లేకపోతే బాగుండదు.

మీరేమో  దగ్గరుండి టిడిపి-బిజెపిలకు ఓటేయించినారు.

ఇక్కడ  టిడిపి అయితే ఏపీలో బూవులను నంజుకు తినేస్తోంది.

ఇదేం అన్నేయమండీ బాబూ అని అడిగితే సెంద్రబాబు గోరు ఒంటికాలిపై నెగుస్తున్నారు.

ఏం మంతురులు బూవులు కొనుక్కోకూడదా?
నాలుగు డబ్బులు అక్కరమంగా సంపాదించుకుని బాగుపడకూడదా?
అంటూ ప్రశ్నలతో చంపేస్తున్నారు సెందరబాబు.

పోనీ సిబిఐ చేత బూవులయవ్వారాన్ని తేలుస్తారా అని పెతిపక్షం ఓళ్లు అడిగితే.. ఏం సిబిఐ దర్యాప్తు చేయించి..మేం చిప్పపట్టుకుపోవాలా?
రాజధానిని అడ్డుకోడానికే సిబిఐ అంటున్నారు మీరు అంటూ దబాయిస్తున్నారు.

మరి ఈసవయంలో తవరేనా బాబుగోరిని ప్రశ్నించకపోతే ఎలాగండీ బాబూ?

అయినా ఇంచుమించు రెండేళ్ల నుంచీ చూత్తున్నా. మీరసలు ఎవరినీ ఎప్పుడూ ప్రశ్నించనేలేదు. మరి ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు.

అంతెందుకు మీరు మొన్న
ప్రెస్ మీట్ పెడితే ఇవే విషయాలు అడిగేస్తారు , కడిగేస్తారు అని మేం అనుకొన్నాం
కానీ వాస్తవంలో మాత్రం జరగుతోంది మరొకటి. కనీసం మహిళా ఎమ్మెల్యే రోజా మీద
చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్న విషయం మీద కూడా మీరు ప్రశ్నించటం లేదు. ఆఖరికి
ఆమె సినిమా పరిశ్రమ నుంచి వచ్చారు. అసెంబ్లీలోకి రానీయకుండా నడి రోడ్డుపై
నిలిపివేసి అవమానిస్తున్నారు. అటువంటి చర్యల్ని మీరు ప్రోత్సహిస్తున్నారనే అనుమానం
కలుగుతోంది.

మీరు ఎప్పటికైనా
ప్రశ్నిస్తారు, ప్రజల తరపున నిలబడతారు అని నెలలు, సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే
ఉన్నాం.

భవదీయ,

కవి కాకి

Back to Top