వాయిస్ ఆఫ్ ఫార్మర్స్‌

చంద్ర‌బాబు వ‌స్తున్న‌డ‌ని తెలియ‌గానే కొంత‌మంది రైతుల్ని సెలెక్ట్ చేసి చంద్ర‌బాబు ప‌థ‌కాల‌ని పొగుడుతూ మాట్లాడాల‌ని ట్రైనింగ్ ఇచ్చి రిహార్స‌ల్స్ చేయించారు. 
బాబు వ‌చ్చాడు. స‌భ మొద‌లైంది.
"నేను రైతుల కోసం ఎంతో చేసాను.  ఇంకా చేస్తాను. ఎంతో చేస్తాను. నేను వాళ్ల‌కు ఏం చేసానో రైతులే చెబుతారు" అన్నాడు బాబు
ఒక రైతు లేచి "చంద్ర‌బాబు మాకు ఆద‌ర్శం. ప‌దెక‌రాలు వుండి కూడా నేను పాప‌ర్ పట్టాను. అలాంటిది రెండెక‌రాల‌తో ఆయ‌న ల‌క్ష‌కోట్లు సంపాదించాడు. ఆ లెక్క‌న నేను ఐదు ల‌క్ష‌ల కోట్లు సంపాదించాలి. అదే నా టార్గెట్‌. చంద్ర‌బాబు వ‌ల్ల నాకు కుటుంబ భారం త‌గ్గింది. మా నాయ‌న, అన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆయ‌న ఇంకా కొంత‌కాలం అధికారంలో వుంటే నేను కూడా పోయేవాన్నే. మ‌ధ్య‌లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌చ్చి బ‌తికించారు. మ‌ళ్లీ ఈయ‌నొచ్చారు. ఈసారి నాకు త‌ప్పేలా లేదు..."
"వీడు న‌న్ను పొగుడుతున్నాడా... తిడుతున్నాడా?"  బాబు అనుమానంగా అడిగాడు.
"పొగుడుతున్నట్టు న‌టిస్తూ తిడుతున్నాడు సార్ అని  చెప్పాడు పి.ఎ.
"అయితే వాడ్నిలాగేసి, ఇంకో రైతుని మాట్లాడ‌మ‌నండి"
ఇంకో రైతు వ‌చ్చాడు "చంద్ర‌బాబు మంచివాడు. ఆయ‌న పాల‌న‌లో రైతులు సుఖ ప‌డ్డారు. త‌న పాల‌న‌లో పురుగుల మందుకి డిమాండ్ పెంచిన ఏకైక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఎందుకైనా మంచిద‌ని రైతులు ముందే కొని పెట్టుకుని వీలైన‌ప్పుడు త‌గేవాళ్లు. చావుకి మించిన సుఖం రైతుకి ఏముంటుంది. యమ‌లోకంలో వ‌డ్డీవ్యాపార‌స్తులుండ‌రు. ప‌స్తులుండాల్సిన ప‌నిలేదు" అని చెప్పాడు.
"ఏం మాట్లాడుతున్నాడు వీడు. య‌మ‌లోకానికి నాకు సంబంధ‌మేంటి?"  అడిగాడు బాబు
"మీరు అధికారంలోకి వ‌స్తే య‌ముడికి ప‌ని పెరుగుతుంది సార్" చెప్పాడు పి.ఏ.
"నా గురించి మంచిగా మాట్లాడ‌మ‌ని ట్రైనింగ్ ఇమ్మంటే, ఇదా మీరు చేసిన నిర్వాకం? " కోపంతో చిందులేసాడు చంద్ర‌బాబు
"మేము కారెక్ట్‌గానే ట్రైనింగ్ ఇచ్చాం సార్‌. కానీ ప్ర‌తివాడు త‌న సొంత ఆవువ్యాసం చ‌దువుతున్నాడు. ఈసారి వున్న‌దున్న‌ట్టుగా చ‌ద‌వ‌మ‌ని చెబుతానుండండి" అని పి.ఎ. ఒక రైతు ద‌గ్గ‌రికెళ్లి ఒక కాగాతాన్ని ఇచ్చాడు.
"దీంట్లో ఏముంటే అదే చ‌దువు" అన్నాడు
"రైతు ఆ కాగితం తీసుకుని "చంద్ర‌బాబు ధ‌ర్మ ప్ర‌భువు. వ్య‌వ‌సాయం దండ‌గ‌ని ఆయ‌న ఏనాడో చెప్పాడు. కానీ మేము విన‌లేదు. వ్య‌వ‌సాయం చేసి దెబ్బ‌తిన్నాం. రైతుల‌కి మేలు చేస్తాన‌ని ఆయ‌న అనేమాట‌లు అబ‌ద్ధం..."
పి.ఎ. కోపంతో "నేనిచ్చిన కాగిత‌మేంటి... నువ్వు చ‌దివేదేంటి?"
"ఏం చేసేది సార్‌?  బాబుని చూడ‌గానే ఆయ‌న మీదున్న కోపంతో లోప‌ల ................ ఏముందో క‌న‌బ‌డ్డం లేదు" అన్నాడు రైతు
Back to Top