వినేవాడు వెంగళప్పైతే చెప్పేవాడు చంద్రప్ప

 

గుజరాత్ ను ఆంధ్రా దాటిపోతుందని మోదీ భయం అంటారు చంద్రబాబు.
బాబు జ్ఞాన భేరి సదస్సులో ప్రసాదించిన ఈ జ్ఞానం విన్నవాళ్లు ఆశ్చర్యంతో అవాక్కైపోతున్నారు.
అవునా నిన్నటిదాకా మోదీ చంద్రబాబుకు భయపడుతున్నాడనుకున్నామే .... కాదా ఎపి గుజరాత్
ను దాటిపోతుందని భయపడుతున్నాడా అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. గుజరాత్ లో సాగునీటి
ప్రాజెక్టులు శరవేగంగా పూర్తైపోయాయి...ఎపిలో నాలుగున్నరేళ్లు గడుస్తున్నా పోలవరం పనులు
కమీషన్ల దగ్గరే కొట్టుమిట్టాడుతున్నాయి. మరెందుకు ఎపి గుజరాత్ ను దాటిపోతుందని మోదీ
భయపడాలి. పోనీ వ్యాపార రంగంలో గుజరాత్ వ్యాపార దిగ్గజాలైన టాటాలు, అంబానీలాంటి వాళ్లు
ఎపిలో పెట్టుబడులు పెడుతున్నారా, పారిశ్రామికంగా ఎపిని పరుగులు పెట్టిస్తున్నారా అంటే
అదీలేదాయె? మరెందుకు మోదీ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కు పోటీ అని భయపడుతున్నట్టు...

కాస్త డీప్ గా ఆలోచిస్తే ఒకటి తడుతోంది...పాలనా విషయాల్లో చంద్రబాబు
మోదీకి పోటీగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు. వెలిగిపోతోంది అని చెప్పుకోవడంలో మోదీ, చంద్రబాబు
ఇద్దరూ ఇద్దరే. ఇక గుజరాత్ వెలుగుల వెనకున్న చీకటిని అక్కడి మీడియా ఎలా కప్పెట్టేసిందో,
సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ వెనుక అవినీతి కోణాలను ఎపిలో జాతి మీడియా అలాగే ముసుగు కప్పి
ఉంచింది. గుజరాత్ లో మతోన్మాదం పెరిగి ముస్లింల ఊచకోతకు కారణమైనట్టుగానే, ఆంధ్రప్రదేశ్
లో కులదురహంకారం, అధికారాహంకారాలు పెరిగి దళితులపై, సామాన్యులపై అరాచకాలు పెరిగిపోతున్నాయి.
కనుక ఇలాంటి విషయంలోనూ గుజరాత్ ను మించిపోయేలా ఎపి ఉందని మోదీ భావించి ఉండొచ్చు.

అందుకే చంద్రబాబు చెప్పినట్టు మోదీ ఎపి అభివృద్ధిని చూసి భయంతో
గజగజా వణికిపోతున్నాడని ఒప్పుకునే తీరాలి. ఎందుకంటే వినేవాడు వెంగళప్పైతే చెప్పేవాడు
మరి చంద్రప్పేగా???

 

 

Back to Top