ఈయ‌న‌ తేడా?

నిన్న హిట్లర్ నేడు హిజ్రా రేపు ఏమిటో? రోజుకో వేషం వేస్తూ పార్లమెంట్ ముందు పంచాయితీ చేస్తున్నాడు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. దానికి ఆయన పెట్టే పేరు విభజన హామీల కోసం కేంద్రంతో పోరాటం. అంటే అధికారం ఉండి, ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉండీ ఓ పార్లమెంటేరియన్ గా సభలో కూర్చుని పోరాడాల్సిన మనిషి పగటి వేషాలు వేస్తూ పార్లమెంట్ బయట నిలబడటాన్ని ఏమనుకోవాలి? ఇలా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా? విభజన హామీలు నెరవేరతాయా? 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మైకు లేకుండా చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని అధికార పార్టీ అడ్డగోలుగా ప్రవర్తించింది. దానికి ప్రతిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లోకి వెళ్లింది. ప్రభుత్వం పై నిరసనను ఆ విధంగా తెలియజేసింది. కానీ టిడిపి దంతా హంగు ఆర్భాటం. దీక్షల పేరు చెప్పి ఎసిల్లో కూర్చోవడం, చిన్నపిల్లలను, ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా దీక్షలకు రప్పించడం. ప్రధాని లేనప్పుడు ఆయన ఇంటి ముందు గలాట చేయడం. ప్రధాని లేనప్పుడు పార్లమెంట్ లో ప్లకార్డు ప్రదర్శించడం. ఇదీ టిడిపి పోరాట నీతి. ఉత్తర కుమారుడు శవాల తలపాగాలపై కుచ్చులు కోసుకెళ్లినట్టు చంద్రబాబు ఏ ప్రయోజనం లేని ఉత్తుత్తి పోరాటాలు, అట్ట కత్తి యుద్ధాలు బాగా చేస్తాడు. ఆ తానులో గుడ్డలాగే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా చేయాల్సిన పని మాని మారవేషాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. 

ప్రభుత్వం అన్యాయానికి వ్యతిరేకంగా, నిర్లక్ష్యానికి నిరసనగా చేసే పోరాటం ఎలా ఉండాలో వైఎస్ జగన్ ను చూస్తే అర్థం అవుతుంది. వేటకి సింహం వెళ్లినట్టు ప్రత్యర్థులపైకి జగన్ దూసుకుపోతున్నాడు. అధికారంలో ఉండి కూడా గుంటనక్కలాగా చంద్రబాబు అండ్ కో వేషాల మాటున, దగాకోరు దీక్షల చాటున రాష్ట్రం కోసం ఏదో చేస్తున్నట్టు నక్కి నక్కి నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్లంతా చంద్రబాబు, శివప్రసాద్ లాంటి వీళ్లు తేడా అంటున్నారంటే అనరూ మరీ. 
 
Back to Top