యూస్ అండ్ త్రో బాబు!

పొత్తులంటే మొక్క జొన్న పొత్తులే చంద్ర బాబు దృష్టి లో. తిన్నాక కండెను విసిరేసినట్టు పార్టీలను వాడుకుని ఛీ కొట్టడం ఆయనకలవాటు. ఎన్నికల వేళ పొత్తుల సీజన్ ఆయనకు. బాగా ఏపుగా పెరిగిన జొన్నచేనులాంటి పార్టీ ని ఎంచుకుంటాడు బాబు. 2014 లో మోడీ స్వింగ్ బాబుకు చక్కగా ఉపయోగ పడింది. రాష్ట్రం లో హోదా సెంటిమెంట్ పెరగడం, ప్రతిపక్షం ప్రజలను హోదా జెండా కింద ఒక్కటిగా నిలపడం బాబుకు మింగుడుపడని వ్యవహారం గా తయారైంది. 4 ఏళ్లుగా బీజేపీ మైత్రి బాబుకు చేకూర్చిన ప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో మోదీ దయను బాబు ఇరుకున పెడుతూనే ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక వైఖరి ప్రదర్శించాల్సిన దుస్థితి బాబుది. ఆ సమయంలో కాంగ్రెస్ చేయి పట్టుకుని మోదీని తిడుతున్నాడు బాబు. రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి తమ దగ్గరితనం మరింత పటిష్టం చేసుకున్నాడు. 

బాబు ప్రయోజనాల పథకాలు...
బీజేపీ తో పొత్తు తన మీద కేసులను తొక్కిపెట్టడానికి ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. ఇక కాంగ్రెస్ తో పొత్తు కు కారణం జగన్ పై కేసులు. బీజేపీలో ఉన్నన్నాళ్లూ జగన్ను  మళ్లీ జైలుకు పంపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు బాబు. ఇప్పుడు బద్ధశత్రువు లాంటి కాంగ్రెస్ తో కలిసి మరోసారి కుట్రలకు తెర తీయబోతున్నాడు. 
రెండు నాల్కల ధోరణి
విభజన హామీలు నెరవేర్చనందుకు బీజేపీ ని బహిష్కరించా అని చెప్పాడు. విభజించిన కాంగ్రెస్సే హోదా ఇస్తా అందంటూ ఎన్నికల పొత్తుకు సిద్ధం అని లీకులిస్తున్నాడు. మళ్లీ ఎన్నికల తర్వాత Nda లోనే కలుస్తాం అనడం వెనుక బాబు స్కెచ్ ఉంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు తక్కువ. మళ్లీ మోదీ గెలిచే అవకాశాలు ఎక్కువ. కనుక బీజేపీ తో శత్రుత్వం ఎంతైనా తన కేసుల విషయం లో సమస్యాత్మకం కావ్వొచ్చు. రాష్ట్రం లో ఎన్నికలు మాత్రం బీజేపీ తో కలిసుంటే టీడీపీని భూస్థాపితం చేస్తాయి. అందుకే బాబు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత తన పొత్తులు డిసైడ్ చేసి చెబుతున్నాడు. జగన్ పై కక్ష తీర్చుకునే ఏ అవకాశం వదలని సోనియాకు ఈ తరహా ఇనిస్టెంట్ పొత్తు ఉపయోగకరంగా ఉంది. మొత్తానికి బాబు రాజకీయ నీచత్వానికి రాబోయే ఎన్నికలు వేదిక కానున్నాయి....

Back to Top