నీడలోనిజం


చంద్రబాబు ఉన్నట్టుండి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ముఖ్యనేతలు, నోరుచేసుకునే నాయకులు అందులో ప్రముఖంగా ఉన్నారు. అసలు మీరేం చేస్తున్నారు సీరియస్ గా అడిగాడు చంద్రబాబుం
మీరు చెప్పిందేంజిల్లాల వారీగా పంచుకుని, మండలాల వారీగా విభజించుకునింస్థాయిల వారీగా రాష్ట్రాన్ని ఊడ్చుకూంటూ.. క్లీన్ స్వీప్ అదే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం అన్నారు. 
అదిగాదయ్యా నా మీద ప్రతిపక్షం వాళ్లు నానా రకాలుగా విమర్శలు చేస్తుంటే తిప్పకొట్టరేమిటి? మీ నోళ్లకు సీళ్లు పడ్డాయా ఏంటీ అన్నాడు బాబు చిరాగ్గా??
ఏం చేయాలి సార్! ఈ మధ్య కుంభకోణాల్లో మనవాళ్లు మునిగి తేలుతున్నారు. మన పని మనం చేసుకుపోవడానికే టైం చాలడం లేదు. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక తర్వాత మన పనికి అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. ఈలోగా ప్రతిపక్షాల వాళ్లకి సమాధానాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే సర్దుకోడాలు, చక్కబెట్టుకోడాలు ఎలా కుదురుతాయి చెప్పండి. అందుకే వాటికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వటం లేదు చెప్పాడో మంత్రి నిజాయితీగా. 
మీ పనిలో మీరుండండి ప్రతిపక్షం, ప్రజలు కలిసి మన పని పడతారు. పార్టీనీ, నన్నూ ప్రతిపక్షం ఏకి, పీకి, చీలకలు పేలికలు చేసి వదులుతోంది. ప్రతి దానికీ ముఖ్యమంత్రి అయిన నేనే సమాధానం చెప్పుకోవాలా? మీరు ఎవ్వరూ వాళ్లకి కౌంటర్లు ఇవ్వలేరా?? సీరియస్ అయ్యాడు బాబు. 
దాంతో నాయకులంతా అప్రమత్తం అయ్యారు. ఎస్ సర్ ఇకపై ప్రతి కౌంటర్ ని ఎన్ కౌంటర్ తో ఎదుర్కుంటాం. ముందుగా జె.ఎ.సి అంటూ, శ్వేతపత్రం అంటూ పవన్ మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. సో అక్కడ గురి పెడతాం అన్నాడో అమరావతి నేత. 
మీ మొహం మండినట్టే ఉంది. పవన్ మనవాడు. మనం ఆడించినట్టల్లా ఆడేవాడు. అనమన్నవన్నీ మైకు ముందు అప్పజెప్పేవాడు. అప్పుడప్పుడూ ఇలా నెగిటివ్స్ మాట్లాడితేనే రేపు ప్రతిపక్షం ఓట్లు చీలుతాయి. ఇక పవన్ జెఎసి గురించి, డిమాండ్ల గురించి మీరేం పట్టించుకోవద్దు. వాటివల్ల మనకేం నష్టం ఉండదు. పవన్ మనకు వ్యతిరేకం కాదు. మనతో పొత్తులో ఉన్నాడని అనిపించకుండా నెగిటివ్ గా ఏదో ఒకటి అనాలి గనక అలా అంటున్నాడంతే. మీరేమీ పవన్ పై ఒంటికాలి మీద లేవద్దు. 
మరి ఆయన శ్వేత పత్రం అన్నారు గదా అడిగాడో మంత్రి.
మునుపు పోలవరం మీద కూడా అడిగాడు. మనం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని పవన్ మళ్లీ నిన్నో, నన్నో అడిగాడా?
లేదు అన్నాడా ప్రశ్నించిన నాయకుడు.
ఇప్పుడూ అంతే కేంద్రం ఇచ్చిన నిధులకు శ్వేతపత్రం అంటాడు. మనం దానికి కేంద్రం ఇవ్వాలి అని సమాధానం ఇస్తే సరిపోతుంది సింపుల్ గా తేల్చేశాడు బాబు. 
సరే అన్నట్టు తలాడించారు నాయకులు.
యూత్ ని చైతన్యం చేస్తా అన్నాడు. చైతన్య కాలేజీ, నారాయణా కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలపై మనల్నేమన్నా క్వశ్చన్ చేసాడా?
ఒక్కసారిగూడా లేదు చెప్పాడు నేత. 
ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అన్నాడు కానీ, హోదా కోసం మనల్ని రాజీనామాలు చేయమన్నాడా  అడిగాడు బాబు.
అడగలేదు అన్నాడు మంత్రి. 
ఫాతిమా విద్యార్థుల ఘటన, చేనేతలు, యూనివర్సిటీ పర్యటన, విశాఖ పర్యటన ఇలాంటివన్నీ చెప్పాడు గానీ మళ్లీ ఆ మాటెత్తాడా?
లేదు...
ప్రత్యేక హోదా, రైల్వేజోన్, విభజన హామీలు వీటిమీద దేనిమీదైనా స్పష్టంగా మాట్లాడాడా? అవి రాలేదని నేరుగా మనల్ని ప్రశ్నించాడా?
మాట్లాడలేదు, ప్రశ్నించలేదు.
చాలా అంశాలమీద అవగాహన చేసుకునే పనిలో ఉన్నాను అనే కదా చెబుతున్నాడు. చివరికి ఓటుకు నోటు గురించి ఐనా మనల్ని ఒక్కమాట అడిగాడా?
అబ్బే అడగమని అందరూ అన్నా అడగననేశాడుగా మరో ఎమ్మెల్యే హుషారుగా సమాధానం ఇచ్చాడు.
అదే మరీంఇది సమస్య, దీనికి వీళ్లు కారణం, దీనికి ఇది పరిష్కారం, దానికోసం ఇది చేయాలనుకుంటున్నాం, ఇది చేసాం అనే ఏ ఒక్క క్లారిటీ లేకుండా అజ్ఞాతవాసిలా పవన్ సాగిపోతుంటాడు. 

 
Back to Top