తమ్ముళ్లకి తెలుగు క్లాస్

                       తెలుగు తమ్ముళ్లకి చంద్రబాబు తెలుగు సామెతలు, జాతీయాల క్లాస్ తీసుకున్నాడు.
(1) అక్కరకు రాని చుట్టం-ఎవర్నయినా సరే అక్కర వున్నంతవరకే వాడుకోవాలి. చుట్టమైనా సరే వుపయోగపడకపోతే వదిలేయాలి. నేను మా మామ ఎన్యీయార్ ని అవసరమైన మేరకు వాడుకొని చివరికి అక్కరకు రాని చుట్టంగా వదిలేసాను.
(2)మేకవన్నెపులి- రాజకీయాల్లో యాక్టింగ్ అవసరం. పులిలా అందరి మీద పడి తింటున్నా మేకలుగా నటించాలి. రెండెకరాలతో లక్షకోట్లు సంపాదించిన నేను నిరంతరం నీతిసూత్రాలు వల్లిస్తూ వుంటాను. మేకవన్నె అంటే ఇదే
(3)ఈనగోచి నక్కలపాలు చేసినట్టు-మా మామ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టాడు. చైతన్యరథమెక్కి వూరూరూ తిరిగాడు.  పార్టీని అధికారంలోకి తెచ్చాడు. అంతా అయిపోయిన తరువాత నేను వెన్నుపోటు పొడిచాను. ఈనగోచి నక్కల పాలు చేయడమంటే  తెలుగుదేశం పార్టీకి నేను అధ్యక్షుడు కావడమే
(4)రెంటికి చెడ్డ రేవడు- మోడీ నోట్లు రద్దు చేయగానే ప్రతిదాన్ని క్యాష్ చేసుకునే నేను నోట్ల రద్దు నా ఆలోచనే అన్నాను. ఇప్పుడేమో జనం కష్టపడుతున్నారని అంటున్నాను. అటు మోడీ నన్ను నమ్మడు. ఇటు ప్రజలు నమ్మరు. రెంటికి చెడిపోవడమంటే ఇదే
(5)అరచేతిలో స్వర్గం- అమరావతిని సింగపూర్ లా నిర్మిస్తానని చెప్పడమంటే ఇదే. జనం క్యాష్ లేక అవస్థలు పడుతుంటే క్యాష్ లెస్ సొసైటీని సృష్టిస్తాననడం కూడా ఇలాంటిదే.
(6)వుట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందట-రెండున్నరేళ్లుగా రాజధానిని నిర్మించలేదు కానీ, నోరు విప్పితే సింగపూర్. మలేషియా అనడం ఇలాంటిదే. రాజకీయాల్లో మనకి నడవడానికి శక్తిలేకపోయినా గాల్లో ఎగురుదామని చెబుతూవుండాలి.
(7)మింగమెతుకు లేదు, మీసాలకి సంపెంగనూనె- రాష్ట్రంలో రైతులకి గిట్టుబాటు ధర లేదు. కార్మికులకి ఉపాధి లేదు. అందరూ అలో లక్ష్మణా అంటూ వుంటే 8 లైన్ల రోడ్డు నిర్మాణం, అమరావతికి మెట్రో, వైజాగ్ ని గోవా చేస్తా, ప్రతి వూళ్లో విమానాశ్రయం  వీటన్నటికి ఈ సామెత సరిపోతుంది
(8)ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీల మోత-రాష్ట్రంలో వంద సమస్యలుంటే ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లడం, సదస్సుల్లో పాల్గొనడం చేస్తూ వుండాలి. బయట మనం కోతలు కోస్తూ వుండాలి. ఆంధ్రాలో అద్భుతం జరుగుతూ వుందని ప్రచారం చేయాలి
(9)ధృతరాష్ట్ర కౌగిలి-అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్నట్టు నటించి, వాళ్లకి వూపిరాడకుండా చంపేయాలి
(10)దీపముండగానే..-అధికారం వున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అన్నింటిలో ముడుపులు స్వీకరించి సర్దుకోవాలి.చంద్రన్న పథకమంటే ఇదే
Back to Top