చెబితే వినరూ...!

హుద్ హుద్ తుపానుని ఓడించారట.
కానీ..కొవ్వొత్తిని చూసి గజ గజ వణికిపోయారు.
కొవ్వొత్తులతో విశాఖ నగరాన్ని నాశనం చేసేస్తారా అని  హోదా ఉద్యమకారులపై మండి పడ్డారు.
............
మహిళా సాధికారతకు  పెద్ద పీట వేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క తెలుగుదేశమేనట.
మహిళా పార్లమెంటు సదస్సులో  పాల్గొనడానికి వస్తోన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా.. సదస్సుని  అడ్డుకుంటారన్న భయంతోనే  అడ్డుకుని హైదరాబాద్ పంపారట.
...............
కార్లు గ్యారేజీలో ఉంచినట్లే..మహిళలను వంటింట్లో ఉంచాలన్న   కోడెల ప్రసాదరావు మాటల్లో తప్పే లేదట.
అదొక ఎక్స్ ప్రెషన్  మాత్రమేనని చంద్రబాబు నాయుడిగారి జడ్జిమెంట్.
............
అయినా దుర్మార్గంగా...దురహంకారంగా..ఎవరన్నా  కోడెల మాటలను ఎగతాళి చేశారో...చూస్తూ ఊరుకోరట.
జాతీయ మీడియానీ..సామాజిక కార్యకర్తలనీ డబ్బుతో కొనేసి.. అద్భుతంగా జరిగిందని మహిళా పార్లమెంటు సదస్సుపై అవాకులు చెవాకులు  మాట్లాడుతున్నారట.
.............
ప్రత్యేక హోదా పదిహేనేళ్లు ఇస్తేనే కానీ ఏపీకి  న్యాయం జరగదని  ఎన్నికల ప్రచారంలో బాబుకు తోచిందట.
ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరగ్గానే... ప్రత్యేక హోదా వల్ల నష్టమని అనిపించడం మొదలెట్టిందట.
............
మహిళా సాధికారతకు తాను మాత్రమే పని చేస్తున్నారని బాబుగారి మాట.
కోడలు పిల్ల మగ పిల్లాణ్ని కంటే   ఏ అత్త అయినా వద్దంటుందా అని అసలు  సెటైర్లు వేసి దొరికిపోయిన బాబు.
................
అవినీతి అంటేనే చంద్రబాబుకు అస్సలు పడదట.
తెలుగు తమ్ముళ్ల అవినీతిని ఈస్ట్ మన్ కలర్ సినిమాలా గుడ్లప్పగించి చూడ్డం అంటే ఇష్టంట.
................
నోట్ల రద్దు ఆలోచన  బాబు బుర్రలోంచే వచ్చిందట.
నోట్ల రద్దు కష్టాలు మాత్రం తన ఖాతాలో వేయద్దంట.
నోట్ల రద్దు కష్టాలు లేకుండా బిజెపియే చూసుకోవాలట.
..........
తెలంగాణలో  టిడిపి ఎమ్మెల్యేలని టి.ఆర్.ఎస్.లో చేర్చుకోవడం ఘోరమట.
ఆంధ్ర ప్రదేశ్ లో కోట్లు పోసి వై.ఎస్.ఆర్.సి.పి. ఎమ్మెల్యేలను కొని టిడిపిలో చేర్చుకోవడం అభివృద్ధంట.
..............
తన పాలనలో దౌర్జన్యాలను వెలుగులోకి తెచ్చే మీడియా అంటే బాబుకి మంటట.
తాను చేసిందే అభివృద్ధని అందరూ  కీర్తించాలట.

అన్ని విషయాల్లోనూ బాబును పత్రికలు  ప్రతిపక్షాలు ఏకి పారేస్తున్నాయి.
పాపం చంద్రబాబు నాయుడు  ఎంత ప్రశాంతంగా ఉందామని అనుకున్నా.. ఉండనీయడం లేదు.ఇక అనుభవించండి.
-----------------------
కవికాకి
--------------------

Back to Top