టిడిపి ఎమ్.పిల పులి వేషాలు



జాతర్ల, తీర్థాలు జరిగినప్పుడు పులి వేషగాళ్లకు మాంచి గిరాకీ ఉంటుంది. అలాగే కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఎల్లోగ్యాంగ్ కు పులి వేషం వేసే అవకాశం వచ్చింది. ఎపిలో నిలబడి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా  ఆ వేషం వేసారు. ’కేంద్రం మీద ఆగ్రహం వచ్చిందంటూ’ గాండ్రిపులు చేసాడు. బడ్జెట్ జాతర హడావిడి పూర్తవగానే ఇంట్లోకెళ్లి వేషం తీసేసాడు. తోటి వేషగాళ్లందరికీ ఫోన్లు చేసాడు. పొరపాటున గానీ కేంద్రం మీద గాండ్రించేరు. కొంపలంటుకుంటాయి. మీ అందరికంటే ముందు ఆడియోటేపులు నా తోకకు చుట్టి మరీ నిప్పంటిస్తారు. అందుకని రేపు పార్లమెంటులో పులి వేషం కట్టినప్పుడు జాగ్రత్త. గాండ్రించినట్టు శబ్దం రాకూడదు. పిల్లికూతలతో సరిపెట్టండి. అని ఆర్డర్ పాస్ చేసాడు. యధావిధిగా ఆ విషయాన్ని పాటించారు ఇతర పులివేషగాళ్ల బృందం వాళ్లు. 

పార్లమెంట్ గాంధీ బొమ్మ దగ్గర నుంచుని వేషం ఆడ్డట్టం మొదలెట్టారు. ఎంత రంగు పూసుకున్నా పులుల్లా కనిపించడం లేదేంటబ్బా అనుకున్నారు ఒకర్నొకరు చూసుకుని. స్వతహాగా ఉండాల్సిన గాంభీర్యం లేదు కదా? పైగా పిరికితనం ఒకటి నరనరాల్లోనూ జీర్ణించుకునేడిసిందాయె? అనుకున్నారు. సరే ఏమైనా కాని పేమెంట్ పుచ్చుకున్నాక వేషం వేయక తప్పదు కదా అనుకుంటూ మెళ్లో కార్డులు తగిలించుకున్నారు. కాసేపు పిల్లి కూతలు కూసారు. అంతలో సభ మొదలైందని తెలిసింది. తమకంటే ముందే వైయస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ నేతలు గర్జిస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లిపోతూ కనిపించారు. ఎందుకంటే వాళ్లు పార్లమెంటు ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గరే ఉండి విభజన హామీల అమలు గురించి కేంద్రంపై గర్జిస్తున్నారు. సభాపతి వచ్చారని తెలియగానే వాళ్లు వేగంగా అక్కడికి చేరుకున్నారు. వాళ్ల అడుగులో అడుగేసుకుంటూ, వెనకాలే పరిగిడితే సరి, మనల్నీ పులులుగా కౌంట్ చేసేస్తారు అనుకుని వెల్ లోకి పరిగెత్తుకొచ్చారు. కాసేపటికి ప్రధాని మోడీ, తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చారు. ఎపి విభజన హామీలు ఏమిచ్చారో వాటిని ఓ సారి చదివి, ఈఎపి ద్వారా కాకుండా నాబార్డు ద్వారా రుణంగా ఇవ్వమని టిడిపి ప్రభుత్వమే అడిగింది అని చెప్పి, దాని గురించి పరిశీలిస్తున్నాం అని కూర్చున్నారు ఆర్థికమంత్రి. ఆ మాట ఎప్పుడు అంటారా అని కాచుకుచ్చున్న టిడిపి ఎంపిల గుంపు చాలు, చాలు అంతుకుమించి ఏం కావాలి అంటూ గబగబా పులివేషాలు తీసి పక్కన పడేసి వెళ్లి సీట్లల్లో కూచున్నారు. లేదంటే మోడీ హంటర్ తీసి తాటతీస్తాడని ఆ గుంపుకు బాగా తెలుసు. ఇదంతా లైవ్ లో చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఓరి మీ వేషాలో అనుకుని ముక్కున వేలేసుకున్నారు. అటు పులి వేషగాళ్ల ఆట, చెత్తగా చప్పగా సాగుతున్నప్పుడే ఇటు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ సింహాలు గర్జించాయి. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తే మునుపు కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించాయి. విభజన హామీలు నెరవేర్చేదాకా పోరాడతామని పంజా చూపించి మరీ తెలియజెప్పాయి.  

 
Back to Top