మరుపు మంచిదేం!!???

తిరుపతిలో టిడిపి బహిరంగ సభ జరుగుతోంది. చంద్రబాబు ప్రసంగిస్తున్నాడు. ఈ సభ ఎపికి ఇచ్చిన హామీల గురించి మోదీకి గుర్తు చేయడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మోదీ కూడా ఎపి ఎల్లో ఛానెళ్లమీద ఓ కన్నుసి ఉంచాడు. 
సభ మొదలైంది, చంద్రబాబు ప్రసంగం మొదలెట్టాడు. మోదీ టీవీ వంక తదేకంగా చూస్తున్నాడు. 
మోదీజీ నాపేరు చంద్రబాబు నాయుడు అని మీకు తెలియజేస్తున్నాను...ఇదే వేదిక మీద మీరు నేను పవన్ కళ్యాణ్ కలిసి నిలబడ్డామన్న సంగతి మీకు గుర్తుకు తెస్తున్నాను...అని బాబు చెబుతుండగా...
అక్కడ టివి ముందు కూర్చుని టీ తాగుతున్న మోదీకి ఏవో విషయాలు లీలగా కళ్లముందు కనిపించడం మొదలెట్టాయి...
ఆనాడు ఇదే వేదిక మీద మీరు ఏమన్నారుంఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరక్కుండా చూస్తామన్నారు. నా సొంత రాష్ట్రంగా దీన్ని భావించి అభివృద్ధికి సహకరిస్తామన్నారు. 
అక్కడ మోదీ కళ్ల ముందు ఫ్లాష్ బ్యాక్ రీలు గిర్రున తిరుగుతోంది. 
సీమాంధ్రకు అద్భుతమైన రాజధాని కట్టేందుకు సాయం చేస్తామన్నారు. 
మోదీకి తను చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి.
వేదికమీద బాబు ప్రసంగం సాగుతోంది  ఇప్పుడు తెలుగు ప్రజలకు అన్యాయం చేసారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసారు. రాష్ట్రం ఎంతో నష్టపోయింది. బాబు గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాడు.
దిల్లీలో మోదీ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.
చంద్రబాబు వెనక నుంచున్న అధికారి వేదిక మీద ప్రసంగిస్తున్న బాబు దగ్గరకొచ్చి చెవిలో రహస్యంగా చెప్పాడుంమీకు ఢిల్లీ నుంచి ఫోన్ సర్ అనిం
బాబు హడావిడిగా ప్రసంగం మధ్యలో ఆపేసి వేదిక పక్కకెళ్లి ఫోన్ అందుకున్నాడు. 
 

చంద్రబాబూ నువ్వన్నీ నీకు గుర్తున్నవే చెబుతున్నావేం నువ్వు మర్చిపోయినవి ఇంకా చాలా ఉన్నాయి. అదే వేదిక మీద నువ్విచ్చిన హామీల సంగతి నువ్వు మర్చిపోయావా? అవి నేను నీకు చెప్తాను వినుంమోదీ గొంతులో వెటకారం బాబుకు అర్థం అవుతూనే ఉంది. నుదిటిమీద చెమటలు పట్టడంతో కర్చీఫ్ తో తుడుచుకునింఅది కాదు జీంనసగబోయాడు బాబుం
అది పట్టించుకోకుండా మోదీ చెప్పడం మొదలెట్టాడు.
చంద్రబాబు నాకంతా గుర్తొచ్చింది. సీమాంధ్రప్రజలకు స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబును ఎన్నుకోవాలని నేను చెప్పాను. నువ్వు అధికారంలోకి వచ్చాక స్వర్ణాంధ్రను మర్చిపోయావ్. ప్రంపచ దేశాలన్నీ తిరిగి గొప్ప రాజధానులను చూసి ఓ మంచి రాజధాని కట్టుకుందాం అని చెప్పాను. నువు దేశాలు తిరిగావ్ రాజధానిని కట్టడం మర్చిపోయావ్.ఢిల్లీ చిన్నబోయే లాంటి రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పాను. నీ సొంత పనుల మీద అడపా దడపా ఢిల్లీ కొచ్చి నువ్వే చిన్నబోయావ్. 
మనిద్దరి సాఫ్ట్ వేర్  అదే బుర్రలో ఆలోచనలు ఒకేలా ఉంటాయని కూడా చెప్పాను. కావాలంటే మళ్లీ ఒక సారి గుర్తు చేసుకో. నువ్వెలా చేస్తానన్నవి చేయకుండా మర్చిపోయావో..నేనూ అలాగే మర్చిపోయాను. 
స్కీమాంధ్రను స్కామ్ ఆంధ్రగా మార్చాలనుకుంటేంఅని నేను ప్రత్యేకంగా చెప్పాను. అలాంటి స్కామాంధ్ర ప్రభుత్వానికి నేను సహకరించలేనని నొక్కి వక్కాణించాను. నువ్వు స్కాములతో రాష్ట్రాన్ని నొక్కేసి, తొక్కేసి, బొక్కేసావ్. పోలవరం, పట్టిసీమ, రాజధాని, విశాఖ భూములు, కరెంటు, నీరుచెట్టు ఇలా కుప్పల కుప్పల స్కామ్ లతో ఆంధ్రప్రదేశ్ ని స్కామ్ ప్రదేశ్ చేసేసావ్. ఆ ముఖ్యమైంది మర్చిపోయాను ఓటుకునోటు స్కామ్ దీని గురించి నీకసలు నేను గుర్తు చేయాల్సిన పని లేదేమో కదాం
ఓటుకు నోటు పేరు మోదీ నోట వినబడగానే చంద్రబాబు వణుకు మొదలైపోయింది. మోదీ కొనసాగించాడు. 
మరి నేను అన్నమాట మీదే నిలబడ్డాను. స్కామాంధ్రప్రదేశ్ ను ఎన్నుకుంటే కేంద్రం ఏ సాయం చేయలేదు అని ఆనాడే తిరుపతి సభలో చెప్పాను. రాష్ట్రాన్ని దోచేవాళ్లను ఏరి మరీ గుణపాఠం చెబుతానని కూడా చెప్పాను అని బాబు రియాక్షన్ కోసం ఆగాడు.
బాబు నోట మాట పెగలడం లేదుంమోదీ అది గమనించి ఈ సారి టోన్ పెంచాడు.
నాకన్నీ గుర్తున్నాయి బాబూంనేను చెప్పినవన్నీ ఇప్పుడు నీకు కూడా గుర్తొచ్చాయనుకుంటాను. సరే ఇక ఉంటాను.,.అని ఫోన్ పెట్టాశాడు మోదీ. షాక్ తో నిలబడిపోయాడు చంద్రబాబు. అప్పుడు గుర్తొంచ్చింది బాబుకు తిరుపతి సభ మోదీ ప్రసంగంలో చిట్టచివరి మూడు మాటలుంగోవిందా..గోవిందాం గోవిందాం  
Back to Top