సమ్మర్ క్లాసెస్

చంద్రబాబు సమ్మర్ క్లాస్ లు మొదలుపెట్టాడు
తమ్ముళ్లూ ప్రజాస్వామ్యమనగా ఏమి? అడిగాడు బాబు
ప్రజలను వంచించడం
వెరీగుడ్, సామాజిక స్పృహ అనగా ఏమి?
సమాజం పట్ల స్పృహ వున్నవాళ్లని, స్పృహ కోల్పోయేలా చావబాదడం
పర్ ఫెక్ట్ ఆన్సర్. అరచేతిలో స్వర్గమనగా?
అమరావతి నిర్మాణం
మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగనూనే, ఈసామెతకి ఉదాహరణ
అమరావతి మెట్రో రైల్
బేరసారాలు, దీన్ని సొంతవాక్యంలో చెప్పండి
ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడి, సంతలో పశువుల్ని కొన్నట్టు కొనాలి
అనువుగాని చోట అధికులమనరాదు అంటే
మోడీ దగ్గర వినయంగా ఉండాలి
ఉత్సవ విగ్రహాలు అంటే
ఉపముఖ్యమంత్రులు
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటే అర్థం?
మీరు ప్రజల్ని తింటే, లోకేష్ బాబు మాత్రం వదులుతాడా?
గాలిమేడలు
రాజధాని నిర్మాణం
చంద్రబాబు  అందరివైపు సంతృప్తిగా చూసి మార్కులు వేసుకున్నాడు
తాటాకు చప్పుళ్లు అంటే అని అడిగాడు
మీరు బీజేపీపై చేసే విమర్శలు
ఇంకుడు గుంత
మీదురాశ, అందులో ఎంత డబ్బు పోసినా ఆవిరైపోతుంది
ఆరకంగా ముందుకు పోవడమంటే?
మనం మాత్రమే ముందుకెళ్లి, మన వెనుక వున్నవారిని వెనుకే వుండేలా చేయడం
కుయుక్తి అంటే
టీడీపీ మేనిఫెస్టో
సత్యహరిశ్చంద్రుడు
చంద్రబాబు, ఆయన అబద్ధం చెప్పడు, ఈయన నిజం పలకడు
చెక్కగుర్రం
రాష్ట్ర అభివృద్ది, మీరు దౌడు తీయిస్తారు కానీ, అది వెళ్లలేదు
గురివింద గింజ
మీరు అవినీతి గురించి మాట్లాడడం
పోలవరం
తెల్లఏనుగు
పట్టిసీమ 
ఎండమావి
అందరికీ మార్కులేసి బాబు వెళ్లిపోయాడు
Back to Top